ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కను బస్టాండ్ వద్ద దింపి.. తమ్ముడు ఇంటికి వెళ్లి వచ్చేసరికి..

ABN, First Publish Date - 2020-08-10T20:53:54+05:30

జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ వద్ద రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి బీఈడీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైలుకింద పడి విద్యార్థిని ఆత్మహత్య


మంచిర్యాల టౌన్‌(అదిలాబాద్): జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ వద్ద రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి బీఈడీ రెండో సంవత్సరం చుదువుతున్న విద్యార్థిని గూడ్స్‌ రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సంపత్‌  తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని రాళ్లపేటకు చెందిన ఉత్తిపల్లి చంద్రమౌళి-రమణమ్మ దంపతుల నాలుగో కుమార్తె శిరీష (23) శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి తన తమ్ముడితో కలిసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లింది. స్థానిక బస్టాండ్‌ సమీపంలో ఆమెను దింపి, మార్కెట్‌కు వెళ్లిన మరో అక్కను ఇంటి వద్ద దింపేందుకు తన తమ్ముడు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి బస్టాండ్‌ సమీపంలో శిరీష కనిపించలేదు. ఫోన్‌ మోగుతున్నా ఎత్తకపోయేసరికి ఆమె కోసం చుట్టు పక్కల వెతకాడు.

 

ఇంతలో  రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం పడి  ఉందన్న సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. హెడ్‌కానిస్టేబుల్‌ సంపత్‌ శిరీష కుటుంబ సభ్యుల కు సమాచారం అందించారు. కాగా శిరీష పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో బీఈడీ చదువుతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతుండేదని, కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితం కావడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. కేసు నమోదు చేసి, ధర్యాప్తు జరుపుతున్న ట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-08-10T20:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising