ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘హరితహారం’ లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్‌ భారతి హొళికేరి

ABN, First Publish Date - 2020-09-29T05:52:27+05:30

జిల్లాలో 2021-22కు సంబంధించి తెలంగాణ హరితహార లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 28: జిల్లాలో 2021-22కు సంబంధించి తెలంగాణ హరితహార లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అటవీ అదికారి శివాని డోంగ్రే, జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠిలతో కలిసి కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో శాఖల వారీగా నిర్దేశిత లక్ష్యాలను కేటాయించామని చెప్పారు. రెండు  సంవత్సరాలకు గాను మొక్కల పెంపునకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలను నర్సరీలలో పెంచి సిద్ధం చేయాలని సూచించారు. అవని ప్లాంటేషన్‌, హరితవనాలు పెంచాలని, పరిశ్రమలు, పాఠశాలలు, కార్యాలయాలు, వసతిగృహాలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ వసతిగృహాలు, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖతో  పాటు అన్ని శాఖల పరిధిలో అన్ని మున్సిపాలిటీలలో కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, బెల్లంపల్లి  డివిజన్‌ అటవీ అధికారి లావణ్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్‌, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఖాజా నజీమ్‌ అలీ అఫ్సర్‌, జిల్లా సాంఘిక  సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి హరనాథ్‌, జిల్లా ఆబ్కారీ శాఖ, రోడ్లు భవనాల శాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి సప్జర్‌ అలీ, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు, పంచాయతీ రాజ్‌ ఈఈ ప్రకాష్‌, మున్సిపల్‌ కమిషనర్లు, సింగరేణి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T05:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising