హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
ABN, First Publish Date - 2020-12-30T03:55:21+05:30
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనీ, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఏసీసీ, డిసెంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనీ, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. పోలీ సులు జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ను అరెస్టు చేయడంతో ఉద్రిక్త నెలకొంది. కార్యకర్తలు జాతీ యరహదారిపై బైఠాయించి ప్లకార్డులతో ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రఘు నాథ్ మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్ టీచర్లకు గౌరవ వేతనం, నిరుద్యోగభృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల ప్రైవేటు స్కూల్ టీచర్లు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతు న్నారన్నారు. అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలిం చిన అనంతరం స్టేషన్ ఎదుట బైఠాయించి నిర సన వ్యక్తంచేశారు. మల్లేష్, పెద్దపెల్లి పురు షోత్తం, వెంకట కృష్ణ, తులామదుసూదన్, హరికృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T03:55:21+05:30 IST