ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శాసనాలు

ABN, First Publish Date - 2020-12-03T06:18:13+05:30

దక్షిణ భారత దేశాన్ని అత్యంత ప్రభావితం చేసి సమర్థ పాలనను అందించిన కళ్యాణి చాళుక్యరాజు ఆరో విక్రమాదిత్యకు వేయించిన అరుదైన ప్రాచీనకన్నడ శాసనాలు బుధవారం మండలం లోని బ్రహ్మశ్వర ఆలయానికి 30 మీటర్ల దూరంలో లభ్యమయ్యాయి.

తవ్వకాల్లో బయట పడ్డ శాసనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రహ్మేశ్వర ఆలయానికి సమీపంలో ..

లోకేశ్వరం, డిసెంబరు 2 :  దక్షిణ భారత దేశాన్ని అత్యంత ప్రభావితం చేసి సమర్థ పాలనను అందించిన కళ్యాణి చాళుక్యరాజు ఆరో విక్రమాదిత్యకు వేయించిన అరుదైన ప్రాచీనకన్నడ శాసనాలు బుధవారం మండలం లోని బ్రహ్మశ్వర ఆలయానికి 30 మీటర్ల దూరంలో లభ్యమయ్యాయి. అక్కడ తవ్వకాల్లో భాగంగా శాసనాలు బయ టపడ్డాయి. నిర్మల్‌ జిల్లాలో ప్రాచీన శాసనాలతో ఘనమైన చరిత్ర వెల్లడైవుతుందని ప్రముఖకవి, చరిత్ర పరిశోధ కుడు తుమ్మల దేవరావు తెలిపారు. వేల సంవ త్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న శాసనాలు లభ్యం కావడంతో నిర్మల్‌ జిల్లాలో మట్టిపొరల కింద దాగిన మహాచరిత్ర వెలుగులోకి వస్తుం దని ఆయన తెలిపారు. మొదటి చాళుక్య సో మేశ్వరుని కుమారుడైన ఆరో విక్రమాదిత్య క్రీ.శ 1076 నుండి క్రీ.శ 1126 వరకు సుదీర్ఘంగా పాలించిన రాజుగా ఎనలేని కీర్తి గడించారు. త్రిభువనవల్లభగా మూడు ప్రపంచాల ప్రభువుగా బిరుదు పొందిన విక్రమాదిత్యుడు మహామండలేశ్వర గోమర సుల్ని ఉత్తర తెలంగాణ పాలకుడిగా నియమించారన్నారు. విక్రమశకం వీరి నుండే ప్రారంభమయినట్లు తెలుస్తుంది. విక్రమాదిత్య పాలన ప్రారంభమై 15 సంవత్సరాలు అయిన సందర్భంగా క్రీ.శ 1091 ఏడీలో బ్రహ్మేశ్వర శాసనం చేయించారన్నారు. ఇక్కడ సూర్యగ్రహణం రోజున ఈ శాసనం గురించి ఆలయ దూప, దీప నైవేద్యాలకు, ఆలయానికి వచ్చే సన్యాసులకు అహార పదార్థాలు, ఔషదాలు ఇచ్చేందుకు భూమిని దానం చేసినట్లు శాసనంలో లభించాయన్నారు. విక్రమాదిత్యుని 65వ శాసనం వెలుగులోకి రావడంతో జిల్లాచరిత్రకు  గొప్ప మేలు జరుగుతుందన్నారు. ఈ శాసనం చెక్కిన శిల్పి నాగోజు అని తెలిపారు. శాసన పరిష్కారం కోసం సహకరించిన ఎపీ గ్రఫీ ఆర్కియాలజీకల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మైసూర్‌ వారికి కృతజ్ఙతలు తెలిపారు. 

Updated Date - 2020-12-03T06:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising