రైతు సమస్యలను పరిష్కరించాలి
ABN, First Publish Date - 2020-12-12T04:46:22+05:30
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో పలు మండలాల్లో శుక్రవారం ఆందోళనలు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు
ఆదిలాబాద్ రూరల్, డిసెంబరు 11: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో పలు మండలాల్లో శుక్రవారం ఆందోళనలు నిర్వహించారు. దీనిలో భాగంగా, గులాబీ పురుగుతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ హాజరై మాట్లాడారు. వ్యవసాయ చట్టం రూపొంది దాదాపు ఆరు నెలలు గడుస్తునప్పటికీ పార్లమెంట్, రాజ్యసభలో ఈ బిల్లులపై విస్త్రృతంగా చర్చించిన తర్వాతనే బిల్లు ఆమోదం పొందిందని, అప్పుడు నోరు మెదపని కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని తప్పుతోవ పట్టించి రైతు ఆత్మహత్యలకుకారణం అవుతున్నారని ఆరోపించారు. అనివార్య బంద్‌ను ప్రభుత్వ నిర్వహించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తు నిరసన తెలుపడం జరిగిందని అన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇందులో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దయాకర్, మండల అధ్యక్షుడు సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోండేరి రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడమండ్ల రాజమణి, జిల్లా నాయకులు మెస్రం బాగ్యలక్ష్మి, ఓబీసీ నాయకులు ఉస్కమల్ల దేవిదాస్, ముండే గజానంద్, బండారి వెంకటేష్, తదితరులు ఉన్నారు.
భీంపూర్: అకాల వర్షాలతో మండలంలో పత్తి, కంది సహా ఇతర పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లిందని, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ నాయకులు భీంపూర్ తహసీల్దార్ ఎం. సోముకు వినతిపత్రం అందించారు. గులావీ పురుగుతో పత్తి ఎకరానికి రెండు క్వింటాళ్లు కూడా రాలేదని, దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో కరంజి(టి) ఎంపీటీసీ రెడ్డి రమేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అంకం అశోక్, నాయకులు హన్మండ్లు, అనిల్, లక్ష్మణ్, రాము, తదితరులున్నారు.
గుడిహత్నూర్: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరు తూ రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు శుక్రవారం మండల బీజేపీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించానలి తహసీల్దార్ పవన్‌చంద్రకు వినతి పత్రం అంద జేశారు. ఇందులో బీజేపీ మండల అధ్యక్షుడు జాడి సుభాష్, జిల్లా అధికార ప్రతి నిధి కేంద్రేలక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ ముండే సంజీవ్, నాయకులు ముండే సుధా కర్, శంకర్, కొండిడా, కేంద్రే శివ, తదితరులు పాల్గొన్నారు.
బోథ్: రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై నిజమైన ప్రేమ ఉంటే పంట రుణాలను మాఫీ చేసి దళాతులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ శివరాజ్‌కు వినతి పత్రం అందించారు. ఇందులో బీజేపీ మండల అధ్యక్షుడు సుభాష్‌సూర్య, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజుయాదవ, నాయకులు అశోక్‌రెడ్డి, వెంకటేష్, కట్టభూమేష్, రాజ్, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ: ఆదిలాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాల ని బీజేపీ జిల్లా అదికార ప్రతినిధి గంగారాం కుర్మే డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ మండల కన్వీనర్ సోసయ్య ి హీరాసింగ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, సహకార సంఘం డైరెక్టర్ అనుపట్ల సంజీవ్, రాములు గట్టు నారాయణ, రాజశేఖర్, నవీన్, తదితరులున్నారు.
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని బీజేపీ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు మరప రాజు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ రాఘవేంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. ఇందులో పార్టీ మండల అధ్యక్షుడు ఆరేళ్లి రాజలింగు, ప్రధాన కార్యదర్శి గెడాం భారత్, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్: మండలంలోని పలువురు రైతులు ఇటీవల వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం జైనథ్‌ను మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రక టించాలని బీజేపీ జిల్లా నాయకులు దీపాయిగూడ ఎంపీటీసీ లోకకరుణాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జైనథ్ మండల బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోస్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
Updated Date - 2020-12-12T04:46:22+05:30 IST