ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూల పండుగకు వేళాయే

ABN, First Publish Date - 2020-10-24T10:49:00+05:30

ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులకు పెద్ద పండుగ. శనివారం సద్దుల బతుకమ్మకు ఆడపడుచులు సిద్ధమయ్యారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు సద్దుల బతుకమ్మ 


నస్పూర్‌, అక్టోబరు 23 : ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ ఆడపడుచులకు పెద్ద పండుగ. శనివారం సద్దుల బతుకమ్మకు  ఆడపడుచులు సిద్ధమయ్యారు. కొత్త వస్ర్తాలను ధరించి ఆటపాటలతో ఆనందంగా గడపనున్నారు. అధికారులు, పాలకవర్గాల సభ్యులు కూడళ్లు, చెరువుల సమీపంలో లైటింగ్‌ ఏర్పాట్లు చేశారు. సద్దుల బతుకమ్మ రోజు ఆడపడుచులు అత్తావారింటి నుంచి పుట్టింటికి చేరుకుని బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. 


ప్రకృతిలో లభించే పూలతో బతుకమ్మలను తయారు చేస్తారు. అనంతరం గృహాలు, వీధులు, ఆలయాల్లో బతుకమ్మ ఆడతారు. గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీ దేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను నిల్పి ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ  మహిళలు బతుకమ్మ ఆట ఆడుతారు. ప్రకృతి, జీవం మధ్య గల సంబంధాన్ని తెల్పడంలో భాగంగా బతుకమ్మలను నిమజ్జనం చేసి పసుపు గౌరిని అలంకరించుకొని పరస్పరం వాయినాలు పంచుకుంటారు. గోధుమలు, పెసళ్ళు, బియ్యం, మినుములు తదితర ధాన్యాలతో తయారు చేసిన సత్తు (పిండి వంటలను) ప్రసాదంగా స్వీకరిస్తారు.  


మార్కెట్‌లో సందడి...

బెల్లంపల్లి టౌన్‌: దసరా పండుగ సందర్బంగా  బెల్లంపల్లి పట్టణంలోని బజార్‌ ఏరియాలో సందడి నెలకొంది.  మేయిన్‌ బజార్‌లో గల పలు షాపింగ్‌ మాల్‌లు, భారీ వస్త్ర దుకాణాలు, రెడిమేడ్‌ డ్రెస్‌లు, జ్యూవెల్లరీ షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. గ్రామీణ  ప్రాంతాల కు చెందిన ప్రజలు వస్ర్తాలతో పాటు బంగా రు ఆభరణాలు  కొనుగోళ్లు చేస్తున్నారు.  


మందమర్రిటౌన్‌ : కోల్‌బెల్ట్‌ ప్రాంతాలైన మంచిర్యాల, మందమర్రి , రామకృష్ణపూర్‌, సీసీసీ, నస్పూర్‌, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్‌లలో దసరా, దీపావళి పండగల సందర్భంగా బట్టలు, బంగారం అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. సింగరేణి కార్మికులకు లాభాల వాటా రూ. లక్ష, దసరా అడ్వాన్సు రూ. 25 వేలు, వేతనాలు రావడంతో షాపింగ్‌లు చేస్తున్నారు. బంగారం ధర రూ. 50 వేలు ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఫ్రిజ్‌లు, టీవీలు, ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. విజయదశమి రెండు రోజులు ఉండడంతో మేకలు, కోళ్లు, మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 

Updated Date - 2020-10-24T10:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising