ఇళ్లలోనే ఉత్సవాలను నిర్వహించుకోవాలి
ABN, First Publish Date - 2020-08-22T11:10:33+05:30
కరోనా నేపథ్యంలో శ్రీరాంపూర్ ఏరియాలో గణేష్ నవరాత్రి ఉత్సవా లు, మొహర్రం ఉత్సవాలకు అనుమతి లేదని శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్
గణపతి నవరాత్రులు, మొహర్రం వేడుకల ను ప్రజలు ఇళ్లలోనే నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గ ణేష్ మండపాల నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఎలాంటి ర్యాలీలకు, ఊరేగింపుల కు అనుమతి లేదని ఉత్సవాల నిర్వహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
శ్రీరాంపూర్/జైపూర్: కరోనా నేపథ్యంలో శ్రీరాంపూర్ ఏరియాలో గణేష్ నవరాత్రి ఉత్సవా లు, మొహర్రం ఉత్సవాలకు అనుమతి లేదని శ్రీరాంపూర్ సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. శుక్ర వారం శ్రీరాంపూర్, జైపూర్ పోలీస్‌స్టేషన్ ఆవరణ లో శాంతి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీరాంపూర్ ఎస్‌ఐ మంగీలాల్, జైపూర్ ఎస్‌ఐ కే. రామకృష్ణ, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, కౌన్సిలర్లు, వినాయక మండపాల ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
భీమారం: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేష న్‌లో గణపతి, మొహర్రం ఉత్సవాల నిర్వహకుల తో ఎస్‌ఐ బర్ల సంజీవ్ సమావేశం నిర్వహించా రు. సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
మట్టి గణపతే మహా గణపతి..
మంచిర్యాల కలెక్టరేట్: మట్టి గణపతే మహాగణపతి అని ప్రముఖ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన ప్రతిమ వల్ల పర్యావ రణం కాలుష్యం అవుతుందన్నారు.
తాండూర్(బెల్లంపల్లి): అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సంతోష్‌కుమార్ ఆ ధ్వర్యంలో తాండూర్ ఐబీలో ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. సంస్థ సభ్యులు కుమార్, కిరణ్, ప్రవీణ్, చరణ్ రాజ్, ప్రదీప్, శ్రీనివాస్, ఆకాష్, కల్పన, గోపాల్‌రె డ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-22T11:10:33+05:30 IST