ఎరువుల వాడకాన్ని తగ్గించాలి
ABN, First Publish Date - 2020-12-16T04:03:49+05:30
అధిక దిగుబడుల ఆశ తో పంటలకు రసాయనాలు వాడి భూములను నిస్సారంగా మార్చుకోవద్దని జిల్లా వ్యవసాయా ధికారి వినోద్‌కుమార్ సూచించారు.
నెన్నెల, డిసెంబరు 15: అధిక దిగుబడుల ఆశ తో పంటలకు రసాయనాలు వాడి భూములను నిస్సారంగా మార్చుకోవద్దని జిల్లా వ్యవసాయా ధికారి వినోద్‌కుమార్ సూచించారు. సహజత్వాన్ని కోల్పోతున్న నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వ్యయసాయ, బెల్లం పల్లి కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో గొళ్లపల్లిలో మంగళవారం రైతులకు అవగాహన నిర్వహించారు. హరితవిప్లవంతో దిగుబడులు గణ నీయంగా పెరిగినప్పటికి రసాయనాల వాడకంతో జీవవైవిధ్యం గతితప్పే ప్రమాదం ఉందన్నారు. నేల లో సహజ సిద్ధంగా అనేక పోషకాలు ఉంటాయని, వాటి స్థితిగతులను అంచనా వేయకుండా ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల సాగుఖర్చు పెరిగి పోవ డమే కాకుండా భూమి సహజత్వాన్ని కోల్పోతుం దన్నారు. యాసంగిలో గ్లైసీ ల్ పత్తి సాగు చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. వరి కల్లాల నిర్మాణం పూర్తి చేసుకోవాల ని సూచించారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్ యాసంగి కోసం వరి నారు మడి తయారీ విధా నం, చలి నుంచి నారు రక్షణ అంశాలపై రైతులకు వివరించారు. బబ్బెర, జొన్న పంటలను శాస్త్రవేత్త లు, అధికారులు పరిశీలించి రైతులకు సూచనలి చ్చారు. ఏడీఏలు సురేఖ, ఇంతి యాజ్ అహ్మద్, సర్పంచ్ ఇందూరి శశికళ, ఏవో శ్రీకాంత్, రమేష్, శాస్త్రవేత్తలు నాగరాజు, సతీష్, పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T04:03:49+05:30 IST