ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతువేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-09-20T07:51:19+05:30

నెలాఖరులోపు రైతువేదిక నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మందమర్రిరూరల్‌, సెప్టెంబరు 19: నెలాఖరులోపు రైతువేదిక నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. శనివారం  శంకర్‌పల్లి గ్రామపంచాయతీలోని రైతు వేదిక నిర్మాణ పనులను  పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు వేదిక భవనాలను నిర్మిస్తోందని, భవనాలను వేగవంతంగా పూర్తి చేయా లని అధికారులకు సూచించారు. అనంతరం మామిడి గట్టు, వెంకటాపూర్‌, ఆదిల్‌పేట గ్రామపంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల కోసం అటవీ అధికారులతో మా ట్లాడి  అనుమతులు ఇప్పించారు. పల్లె ప్రకృతి వనాల ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జడ్పీటీసీ వేల్పుల రవి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో షేక్‌ సప్దర్‌ ఆలీ, సర్పంచులు రాజలింగు, పున్నం, తిరుపతి, ఫారెస్టు అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 


కన్నెపల్లి :  రైతు వేదిక నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్‌ అధికారులకు సూచించారు. కన్నెపల్లి, జన్కాపూర్‌ గ్రామాల్లో నిర్మిస్తున్న పనులను పరిశీలించారు. ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తు న్న రైతు వేదిక భవన నిర్మాణాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రజాప్రతిని ధులు, అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవే క్షిస్తూ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ మోటపలుకుల గురువయ్య, మండల కోఆర్డినేటర్‌ శ్రీరామరావు, ఏడీఏ ఇంతియాజ్‌అహ్మద్‌, ఏవో శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 


హాజీపూర్‌: హాజీపూర్‌ మండలం దొనబండలో పలు అభివృద్ధి పనులను శనివారం ఏపీఓ మల్లయ్య, సర్పం చ్‌ జాడి సత్యంలు పరిశీలించారు. పల్లె ప్రకృతివనం, కంపోజ్‌షెడ్‌, శ్మశానవాటిక నిర్మాణాల పనులను పరి శీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. నిర్ణీత సమ యంలో పనులను సక్రమంగా పూర్తి చేయాలని, పను లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు. పంచాయతీ కార్యదర్శి మాదవ్‌జాదవ్‌ పాల్గొన్నారు. 


కాసిపేట : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలని ఎంపీడీవో ఆలీం సర్పం చులు, కార్యదర్శులకు సూచించారు. శనివారం పల్లం గూడ, కోమటిచేను, ముత్యంపల్లి, కనికలాపూర్‌, కోనూ రు గ్రామాల్లోని అభివృద్ధి పనులను పరిశీలించారు. సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో ముందుకు సాగుతూ పనుల్లో వేగం పెంచాలన్నారు. పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయన్నారు.  

Updated Date - 2020-09-20T07:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising