ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అనుమానితుల తరలింపు

ABN, First Publish Date - 2020-05-27T10:34:48+05:30

మండలంలో ముంబై, చెన్నై వలస కార్మికులతో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగు తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జన్నారం, మే 26 : మండలంలో ముంబై, చెన్నై వలస కార్మికులతో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను  ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు. కిష్టాపూర్‌లో ఒకే కుటుం బం నుంచి నలుగురికి, రోటిగూడలో ముగ్గురికి, కవ్వా ల్‌లో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. రోటిగూడలో పాజి టివ్‌ వచ్చిన వారితో ఉన్న 11 మందిని బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించారు.   


హోం క్వారంటైన్‌లో వారికి నిత్యావసరాలు

బొమ్మెన గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల హైదరాబాద్‌ నుంచి రావడంతో గ్రామస్థులు వారిని గ్రామంలోకి రానీయలేదు. ఊరికి దగ్గర్లో ఒక పాక వేసి హోం క్వారంటైన్‌ చేశారు. వారికి నిత్యావసర వస్తువులు లేవని తెలుసుకున్న తహసీల్దార్‌ రాజ్‌కుమా ర్‌ బియ్యం,  నిత్యావసర వస్తువులు అందజేశారు.  


హోంక్వారంటైన్‌లో 3,311 మంది- క్వారంటైన్‌లో 28, ఐసోలేషన్‌లో 17 మంది 

మంచిర్యాల అర్బన్‌ : జిల్లాలో హోం క్వారంటైన్‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మంగ ళవారం నాటికి 3,311కు హోంక్వారంటైన్‌లో ఉన్నారు. జిల్లాలో 27 పాజిటివ్‌ కేసులు ఉండగా, 28 మంది క్వారంటైన్‌లో, మరో 17 మంది బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి 158 నమూనాలను పంపగా 113  నెగెటివ్‌గా వచ్చాయి. 27 మంది ముంబై వలస కార్మికులకు పాజిటివ్‌  నిర్ధారణ అయ్యింది. తాజాగా 17 మంది రక్త నమూనాలను హైదరాబాద్‌ పంపిం చగా ఫలితాలు రావాల్సి ఉందని జిల్లా కరోనా వ్యాధి పర్యవేక్షకుడు డా. బాలాజీ విడుదల చేసిన బులె టిన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-27T10:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising