ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదాల నివారణకు సమన్వయంతో పని చేయాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-11-27T04:14:47+05:30

ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాద రహిత జిల్లాగా చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్నజిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, నవంబరు26: ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాద రహిత జిల్లాగా చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, అందుకు సంబంధిత శాఖల సహకారం చేసుకోవాలన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో సంబంధిత శాఖలు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగులు పని చేసే చోట ‘నో హెల్మెట్‌ నో ఎంట్రీ’, అదే విధంగా సాధారణ పౌరులకు ‘నో హెల్మెట్‌ నో పెట్రోల్‌’ అనే పద్ధతి అమలు పరచ్చాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రజలు తోడ్పాటు అందించాలని కోరారు. విద్యార్థులకు పాఠశాలలో ట్రాఫిక్‌ నిబంధనలపై విస్తృతంగా తెలియ పర్చాలని సూచించారు. ఎస్పీ విష్ణు ఎస్‌.వారియర్‌ మాట్లాడుతూ పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల శాఖ, నేషనల్‌ హైవే శాఖలు సంయుక్తంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో కల్వర్టులు ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అస్కారం ఉందని వాటి నివారణకు సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. నేషనల్‌ హైవే రోడ్డుపై దేవాపూర్‌, బోరజ్‌, కుప్టి ప్రాంతాలలో ముందస్తు సూచికలను ఏర్పాటు చేయాలని తెలిపారు. జాతీయ రహదారికి ఇరువైపులా దాబాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చాలని, మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని, మద్యాపాన శాఖ, ఈ పోలీసు, రవాణా శాఖల అధికారులు దాడులు నిర్వహించాలని తెలి పారు. 1033 టోల్‌ ఫ్రీ నెంబర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని అదే విధంగా జాతీయ రహదారులపై ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహన చోదకులకు తెలిసే విధంగా మూడు భాషల్లో బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. అంతకు ముందు జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రమాదాల నివార ణకు తీసుకునే చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్‌. శ్రీనివాస్‌రావు, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ ఆర్‌అండ్‌బి, పీఆర్‌, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, డీఈవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T04:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising