ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులైన వారికి పథకాలు అందాలి

ABN, First Publish Date - 2020-12-30T03:53:53+05:30

ప్రజల ఆర్థిక, సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి చేరినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్‌ నేత అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్‌ నేత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘దిశ’ సమావేశంలో ఎంపీ వెంకటేష్‌ నేత

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

రామకృష్ణాపూర్‌, డిసెంబరు 29 : ప్రజల ఆర్థిక, సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి చేరినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్‌ నేత అన్నారు. మంగళవారం క్యాతన్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో గల భీమా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌,  కలెక్టర్‌ భారతి హొళికేరి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి జిల్లా అధికారులతో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు.  ఎంపీ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా జిల్లాలో రైతుల సౌకర్యార్థం విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించడంతోపాటు సాగుపై  సూచనలు చేయడం జరుగుతుందన్నారు. సేంద్రియ సాగుపై రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కొవిడ్‌-19 సమయంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతుల వద్ద నుంచి 2 లక్షల క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, పీఎంకేవైసీలో భాగంగా ఆయిల్‌ పామ్‌ కోసం 400 ఎకరాలకుగాను దాదాపు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. విద్యాశాఖ ద్వారా రాష్ట్రీయ మాధ్యమ, సర్వశిక్షా అభియాన్‌, సమగ్ర శిక్షణ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు సరైన శిక్షణ అందించడంతోపాటు బెల్లంపల్లిలో సైన్స్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, పాఠశాలల్లో తాగునీరు. మూత్రశాలలు, మరుగుదొడ్లతోపాటు కనీస సౌకర్యాలను ఏర్పాటు జరిగిందన్నారు. బడిబాట ద్వారా చదువు మధ్యలో మానేసిన విద్యార్థులకు తిరిగి పాఠశాలలకు రప్పించడం జరిగిందని, విద్యార్థులకు అందించే బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా పంచాయతీ శాఖ ద్వారా ప్రధానమంత్రి రోజ్‌ యోజన పథకంతో జిల్లాకు రూ.5 కోట్ల 80 లక్షల నిధులు మంజూరయ్యాయని, వీటి ద్వారా జిల్లాలోని 29 గ్రామపంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలకు టెండర్లను పిల వడం జరిగిందని, త్వరలోనే పనులను ప్రారంభించడం జరుగుతుందని, పల్లె ప్రగతిలో భాగంగా సీసీ రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ అందించడం జరిగిందన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌లో భాగంగా 15వ ఆర్థిక ప్రణాళికలో రూ.6 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇందులో రూ.49 లక్షలు గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేయడం జరిగిందన్నారు.   పథకాల అమలులో కార్యాచరణ ప్రణాళిక కోసం ఏర్పాటు చేసే మండల సమావేశానికి సంబంధిత  అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. మండల, గ్రామ స్థాయిలో పర్యటించి ప్రతీ పథకం ప్రజలకు అందించేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపాదనలను, మంజూరైన వాటి వివరాలను పూర్తిస్థాయిలో అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు, రైల్వే, పోస్టల్‌, సింగరేణి, మున్సిపల్‌ అధికారులు, చైర్మన్లు, ఎంపీపీలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T03:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising