ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు

ABN, First Publish Date - 2020-12-06T04:21:23+05:30

కన్నాల హైవే రోడ్డులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పనులను పట్టణ రాజకీయ జేఏసీ నాయకులు శనివారం పరిశీలించారు.

బెల్లంపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పరిశీలించి మాట్లాడుతున్న జేఏసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి టౌన్‌, డిసెంబరు 5: కన్నాల హైవే రోడ్డులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పనులను పట్టణ రాజకీయ జేఏసీ నాయకులు శనివారం పరిశీలించారు. టీపీసీసీ కార్యదర్శి మత్తమారి సూరిబాబు, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మణిరాంసింగ్‌ మాట్లాడుతూ  2017లో కన్నాల హైవే ఏరియాలో 160 గృహాల సముదాయానికి మంత్రులు ఆడంబరంగా శంకుస్థాప నలు చేయగా మూడేళ్ళు గడిచినా పూర్తి కాలేదని ఆరోపించారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్ధత కారణంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు  పూర్తి కాలేదని తెలిపారు. ఇండ్లనిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై కలెక్టర్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌  చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్న ప్రాం తంలో  దాదాపు  10 ఎకరాల భూమి అధికార, ఇతర పార్టీలకు చెందిన వారు  ఆక్రమించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జేఏసీ నాయకులు ఎండి అఫ్జల్‌, రత్నం రాజం, దాగం మల్లేష్‌, ఆడెపు మహేష్‌, బండి రాము యాదవ్‌,  శంకర్‌,  లెంకల శ్రీనివాస్‌, జీసీ మాణిక్యం, బర్రె మధున య్య, పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:21:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising