ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల ధర్నా

ABN, First Publish Date - 2020-10-17T06:36:31+05:30

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌, అక్టోబరు16: కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని   మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు శంకర్‌, కార్యదర్శి సంజీవ్‌ మాట్లాడుతూ ప్రతి నెల తమ జీతాల్లో ఈఎస్‌ఐ, పీఎఫ్‌ డబ్బులు జీతాల్లో కోత విధిస్తున్నారన్నారు. కానీ ఖాతాల్లో జమ చేయటం లేదన్నారు.


దీంతో తమకు వైద్య సేవలు ఈఎస్‌ఐలో అందటం లేదన్నారు.అధికారులు వెంటనే స్పందించి తమకు ఈస్‌ఐ సౌకర్యం కల్పించేట్టు చూడాలని కోరారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని ఎస్సై తహసినోద్దీన్‌ మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చారు. అనంతరం కమిషనర్‌ శ్రీనివాస్‌తో చర్చలు జరిపారు. త్వరలోనే చెల్లింపులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొనటంతో ధర్నాను విరమించారు. 

Updated Date - 2020-10-17T06:36:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising