దిల్‌సుక్ నగర్ సాయి సంస్థాన్‌కు ఐఎ్‌సఓ సర్టిఫికేషన్
ABN, First Publish Date - 2020-12-11T07:18:02+05:30
దిల్‌సుఖ్‌నగర్ సాయి సంస్థాన్ చేస్తున్న సేవలు, సంస్థాన్‌లో పాటిస్తున్న ప్రమాణాలు, వసతుల కల్పనకుగాను ఐఎ్‌సఓ గుర్తింపు లభించింది.
ఐఎ్‌సఓ సర్టిఫికెట్‌ను సంస్థాన్ ట్రస్ట్ ప్రతినిధులకు అందజేస్తున్న ఎమ్మెల్సీ కవిత
దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్10(ఆంధ్రజ్యోతి): దిల్‌సుఖ్‌నగర్ సాయి సంస్థాన్ చేస్తున్న సేవలు, సంస్థాన్‌లో పాటిస్తున్న ప్రమాణాలు, వసతుల కల్పనకుగాను ఐఎ్‌సఓ గుర్తింపు లభించింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం సాయి సంస్థాన్‌ను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఐఎ్‌సఓ సర్టిఫికెట్‌ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌గుప్తాతో కలిసి సంస్థాన్ ట్రస్ట్ పాలకవర్గ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎ్‌సఓ సర్టిఫికేషన్ జనరల్ సెక్రటరీ శివయ్య, సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ బచ్చు గంగాధర్, ఈవీవీ నాగేశ్వరరావుశర్మ, అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గుండా మల్లయ్య, మాజీ చైర్మన్‌లు వూర నర్సింహగుప్తా, వనం యాదయ్య, మేడి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక బృందం పరిశీలనతో..
రిటైర్డ్ జడ్డితో కూడిన నలుగురు సభ్యుల బృందం... సాయి సంస్థాన్‌లో భక్తుల వసతుల కల్పన, బాబా ప్రసాదం తయారీ విధానం, అడ్మినిస్ర్టేషన్ పనితీరు, అకౌంటింగ్ నిర్వహణకు పాటిస్తున్న పద్ధతి, ఉచిత ఫిజియోథెరపీ, మెడకల్ పరీక్షల తీరును పరిశీలించింది. ఆయా సేవలు, పాటిస్తున్న ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఐఎ్‌సఓ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ బచ్చు గంగాధర్, ఈవివి నాగేశ్వరరావు తెలిపారు.
Updated Date - 2020-12-11T07:18:02+05:30 IST