ఆసిఫాబాద్ జిల్లాలో ముత్యాల పోచమ్మ బోనాలు
ABN, First Publish Date - 2020-12-29T04:23:21+05:30
మండలంలోని సార్సాల పెద్దవాగు సమీపంలోని పోచమ్మ ఆలయంలో సోమవారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు.
బోనాలు సమర్పిస్తున్న మహిళలు
కాగజ్‌నగర్ రూరల్, డిసెంబరు 28: మండలంలోని సార్సాల పెద్దవాగు సమీపంలోని పోచమ్మ ఆలయంలో సోమవారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. షష్టి బోనాలను పురస్కరించుకుని రెండో సోమవారం ఇక్కడ బోనాల పండగ జరపడం అనవాయితీగా వస్తోంది. భక్తులు బోనాలను వండి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జి పాల్వాయి హరీష్‌బాబు, సర్పంచ్ సత్తమ్మ, నాయకులు గణపతితో పాటు కమిటీ సభ్యులు అశోక్, సురేందర్, శ్రీనివా స్, రాజు, సాయి, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T04:23:21+05:30 IST