ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన మధున పోచమ్మ జాతర

ABN, First Publish Date - 2020-12-03T04:43:45+05:30

మండలంలోని జనగామ గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న మధున పోచమ్మ జాతర బుధవారం అమ్మవారికి బోనాల సమర్పణతో ముగిసింది.

జాతరలో భక్తుల సందడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోటపల్లి, డిసెంబరు 2:  మండలంలోని జనగామ గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న మధున పోచమ్మ జాతర బుధవారం అమ్మవారికి బోనాల సమర్పణతో ముగిసింది. బోనాల సమర్పణ కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. కొత్తకుం డలో కొత్తబియ్యం, బెల్లంతో వండిన పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని మంగళహారతులతో అమ్మవారి చెంతకు వచ్చి ప్రదర్శనలు చేశారు. డప్పుచప్పుళ్లు, వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో జాతర ప్రాంగణం సందడిగా మారింది. జనగామతో పాటు  చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు అమ్మవారికి మొ క్కులు చెల్లించుకున్నారు. ప్రాణహిత అవతలి మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు  చెందిన భక్తులు మంగళవారం జరిగిన రథోత్సవానికి హాజరై అక్కడే నిద్రించి బోనాల సమర్పించుకుని ఇంటి దారి పట్టారు. గ్రామానికి చెందిన దిలీప్‌ అనే యువకుడు పోతరాజు వి న్యాసంతో ఆకట్టుకున్నాడు. శివసత్తుల పూనకాలు జాతరలో ఆకర్షణ గా నిలిచాయి. కాగా మూడు రోజుల పాటు సాగిన జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సర్పంచ్‌ గట్టు లక్ష్మణ్‌గౌడ్‌ పలు సౌకర్యాలు కల్పించగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-12-03T04:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising