ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-12-02T05:30:00+05:30

పూర్తికాని రైతు వేదికల నిర్మాణాలను, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న సెగ్రిగేషన్‌ షెడ్‌, క్రిమిటోరియం, పల్లె ప్రకృతి వనాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 2: పూర్తికాని రైతు వేదికల నిర్మాణాలను, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న సెగ్రిగేషన్‌ షెడ్‌, క్రిమిటోరియం, పల్లె ప్రకృతి వనాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పూర్తికాని రైతు వేదికల నిర్మాణలను వచ్చే సోమవారం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారులను, ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. సెగ్రిగేషన్‌ షెడ్‌, క్రిమిటోరియం, పల్లె ప్రకృతి వనాల పనులపై సమీక్షిం చారు. సీసీ చార్జెస్‌ పెమెంట్‌ పనులు చేయాలని, నర్సరీలకు ప్రభుత్వ భూములను వినియోగించాలని లేనిపక్షంలో మాత్రమే ప్రైవేట్‌ భూములను తీసుకోవాలని పేర్కొన్నారు. నర్సరీలలో మొక్కలను కాపాడి, నర్సరీలకు కావాల్సిన సాయిల్‌ కలెక్షన్‌ చేసుకోవాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పే ఆర్డర్‌ జనరేషన్‌ను ఆప్‌డేట్‌ ఎప్పటికప్పడు చేసి లేబర్‌ టర్న్‌ ఔట్‌ రిపోర్టు పెంచాలన్నారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ మాట్లాడుతూ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూడాలని ఇంజనీరింగ్‌ అధికారులను సూచించారు. అంతకు ముందు పవర్‌ పాయింట్‌ ప్రజం టేషన్‌ ద్వారా సెగ్రిగేషన్‌ షెడ్‌ల నిర్మాణాలను మండలాల వారీగా పరిశీలించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో కిషన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌రాథోడ్‌, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising