ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2020-07-04T10:32:17+05:30

డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు ఉంటాయని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాసిపేట, జూలై 3 : డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు ఉంటాయని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం సోమగూడెం, కాసిపేట, ముత్యంపల్లి, కోమటిచేను, పల్లంగూడ, కోనూరు పంచా యతీల్లో ఆమె పర్యటించారు. డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల పనులను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డంపింగ్‌యార్డులు లేకపో వడంతో కొన్ని పంచాయతీల్లో చెత్త రోడ్లపైకి చేరుతుందని, దీంతో ప్రజలు వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.


ఈనెల 15లోగా డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. కోమటిచేను పంచా యతీలో శ్మశాన వాటిక నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అధికారుల పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనాల కోసం ప్రతి పంచాయతీకి ఎకరం భూమిని కేటాయించాలని తహసీల్దార్‌ భూమేశ్వర్‌కు సూచించారు. హరి తహారంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో శ్రద్ధ వహించాలని సూచించారు. ఎంపీడీవో ఆలీం, ఎంపీవో మేఘమాల, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T10:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising