ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠినచర్యలు

ABN, First Publish Date - 2020-11-28T03:55:40+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అభివృద్ధి పను ల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠినచర్యలు తప్పవని డీఆర్‌డీవో శేషాద్రి పేర్కొన్నారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌డీవో శేషాద్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌, నవంబరు 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అభివృద్ధి పను ల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠినచర్యలు తప్పవని డీఆర్‌డీవో శేషాద్రి పేర్కొన్నారు. శుక్రవారం మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జైపూర్‌, భీమారం మండలాల కార్యదర్శులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ కూలీలను పెంచాలని, యాక్టీవ్‌ జాబ్‌కార్డులకు 40 శాతం పని కల్పించాలని సూచించారు. కంపోస్టు షెడ్‌, శ్మశానవాటిక పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. నర్సరీ పెంపకం పనులను చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో ఉపాధిహామీ పనుల ద్వారా పనులను చేపట్టి గ్రామాభివృద్ధికి దోహదపడాల న్నారు. ఉపాధిహామీ ద్వారా 78 పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. డీఎల్‌పీవో ప్రభాకర్‌, ఎంపీడీవో కేనాగేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌, పంచా యతీ అధికారి కే సతీష్‌కుమార్‌, బాలయ్య, శ్రీనివాస్‌, కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T03:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising