ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

ABN, First Publish Date - 2020-12-03T04:38:48+05:30

మండల కేంద్రంలోని జడ్పీఎస్‌ఎస్‌, ఎంపీపీఎస్‌ పాఠశాలలను బుధవారం మంచిర్యాల డీఈవో ఎస్‌. వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు.

వివరాలు తెలుసుకుంటున్న డీఈవో వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమారం, డిసెంబరు 2: మండల కేంద్రంలోని జడ్పీఎస్‌ఎస్‌, ఎంపీపీఎస్‌ పాఠశాలలను బుధవారం మంచిర్యాల డీఈవో ఎస్‌. వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ, వాటి ఫలితాలపై ఉపాధ్యాయులతో చర్చించారు.  వర్క్‌ ఫ్రం హోంలో ఎంత మంది ఉన్నారని హాజరు పట్టికలను పరిశీలిం చారు. విద్యార్థుల వర్క్‌షీట్‌లను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు, టీవీలు ఉన్న విద్యార్థులు ఎంత మంది అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.  9, 10 తరగతుల విద్యార్థులకు కొంత మంది ఉపాధ్యా యులు గూగుల్‌మీట్‌ ద్వారా అందిస్తున్న బోధనలో సృజనాత్మకతను వ్యక్తిపరిచినందుకు సంతృప్తి వ్యక్తం చేసి వారిని అభినందించారు. కాగా మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన డీఈవోను ఉపాధ్యాయులు సన్మానించారు. పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన  వేణుగోపాల్‌ను డీఈవో శాలువాతో సన్మానించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు వైద్య రాధాకృష్ణ, ఉపాధ్యాయులు బన్న రవీం దర్‌, వెంకటస్వామి, దుర్గయ్య, విష్ణుప్రియ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-03T04:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising