ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్యా యత్నం

ABN, First Publish Date - 2020-05-30T10:54:00+05:30

నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన గోల్డ్‌స్మిత్‌ దుకాణం నడుపుతున్న సౌమ్యశ్రీ చంద్రమౌళి దంపతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి యజమానితో డబ్బుల విషయంలో వివాదం

మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం

నిర్మల్‌ ఆసుపత్రికి తరలింపు


కడెం, మే 29 : నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన గోల్డ్‌స్మిత్‌ దుకాణం నడుపుతున్న సౌమ్యశ్రీ చంద్రమౌళి దంపతులు రూమ్‌ యజమానితో డుబ్బుల విషయంలో వివాదంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే కడెంకు చెందిన చంద్రమౌళి సౌమ్యశ్రీ దంపతులు కడెంలో రూమ్‌ అద్దెకు తీసుకొని గత సంవత్సరం నుండి గోల్డ్‌స్మిత్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కాగా రూమ్‌రెంట్‌కు తీసుకున్న సమయంలో అడ్వాన్స్‌గా రూమ్‌ యజమానికి రాజాగౌడ్‌కు 50 వేల రూపాయలు ఇచ్చారని, ప్రస్తుతం రూమ్‌ మార్చి మరో చోట వ్యాపారాన్ని కొనసాగిస్తామని అడ్వాన్స్‌ డబ్బులు ఇవ్వాలని రూమ్‌ యజమానిని అడగగా డబ్బులు ఇవ్వకుండా సతాయించడంతో తీవ్ర మనస్తాపం చెందిన చంద్రమౌళి సౌమ్యశ్రీ దంపతులు ఆత్మహత్య యత్నానికి  పాల్పడ్డారు.


సౌమ్యశ్రీ దుకాణంలో బంగారు ఆభరణాలు ఉపయోగించే తేజప్‌ ద్రావణాన్ని తాగగా అది గమనించిన భర్త తను కూడా కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. చుట్టు ప్రక్కల వారు గమనించి వారిని అడ్డుకొని నిర్మల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై కడెం ఎస్సై ప్రేమ్‌ దీప్‌ను వివరణ అడగగా తమకు ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-30T10:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising