ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణకు నిరంతర కృషి

ABN, First Publish Date - 2020-08-14T10:20:16+05:30

కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ప్రభుత్వవిప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసన సభ్యుడు బాల్క సుమన్‌ 


మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 13 : కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ప్రభుత్వవిప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ చాంబర్‌లో కలెక్టర్‌ భారతి హొళికేరి, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భా గ్యలక్ష్మి, ఎంపీ వెంకటేష్‌నేత, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివా కర్‌రావు, దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌తో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ సుమన్‌ మాట్లాడుతూ, కరోనా లక్షణాలు కలిగిన అనుమానితులను గుర్తించి వారికి పరీక్షలు జరిపి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, సమయపాలన పా టించాలన్నారు. నియోజకవర్గాల వారీగా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకొని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన కేసులలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు.


భౌతికదూరం పాటించడం మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలన్నారు. పాజిటివ్‌ కే సులలో వృద్ధులు, దీర్ఘకాలిక అ నారోగ్య సమస్యలతో బాధపడే వారికి 72 శాతంగా నమోదైం దన్నారు. జాగ్రత్తలు, నియమా లతో కూడిన కరపత్రాలు ము ద్రించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భం గా ఎమ్మెల్యేల ద్వారా   జిల్లా కు 5 అంబులెన్స్‌లు, పార్లమెంట్‌ సభ్యుల నిధుల నుంచి  1 అంబులెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాకు 8 వెంటిలేటర్లు, ఐసీయూ కోసం 18 పడకలు ఏర్పాటు చేయడంతోపాటు కొవిడ్‌ నియంత్రణకు అవ సరమైన మందులను ఏర్పాటు చేయనున్నట్లు తెలి పారు. శుక్రవారం ప్రభుత్వ విప్‌ ఆధ్వర్యంలో నియో జకవర్గ స్థాయి వైద్యాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు, ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని వైద్యాధికారుల ను ఆదేశించారు.  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నీరజ, ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షకులు అరవింద్‌, జిల్లా సర్వేయలెన్స్‌ అధికారి బాలాజీ  పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-14T10:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising