ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజగృహంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలని ఆందోళనలు

ABN, First Publish Date - 2020-07-11T09:38:16+05:30

ముంబై నగరంలోని రాజగృహంపై దుండగులు దాడి చేసినందుకు నిరసనగా శుక్రవారం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంబేద్కర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 10: ముంబై నగరంలోని రాజగృహంపై దుండగులు దాడి చేసినందుకు నిరసనగా శుక్రవారం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రామగిరి శ్రీప తి, సునీల్‌ కుమార్‌, సుజాత, రాయలింగు, రాజారాం, దశరథం  పాల్గొన్నారు. 


లక్షెట్టిపేట: ముంబైలోని డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ రాజగృహంపై దాడి చేసిన నింది తులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.  ఊత్కూ ర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి తహసీల్దార్‌ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. రాంఅశోక్‌, ధర్మయ్య, రమేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 

నస్పూర్‌: రాజగృహంపై దాడి చేసిన దుండగులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో సీసీసీ కార్నర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నాయకులు నిరసన తెలిపారు. చుంచు శంకర్‌ వర్మ, గద్దల బానయ్య, అంజయ్య, మల్లేష్‌ పాల్గొన్నారు. 


మందమర్రిటౌన్‌: అంబేద్కర్‌ నివాసంపై దాడిని నిరసిస్తూ అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేప ట్టారు. రాంబాబు, కనకం రవీందర్‌లు మాట్లాడుతూ రాజ్యాం గ నిర్మాత నివాసానికి రక్షణ లేకపోవడం దారుణమన్నారు. శ్రీనివాస్‌, కలీం, వీరస్వామి, సత్యం, గణేష్‌,  పాల్గొన్నారు. 


కాసిపేట:  అంబేద్కర్‌ ఇంటిని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ మాదిగ మహారాజ యువకులు నల్లబ్యాడ్జీలు ధరిం చి నిరసన తెలిపారు.  అట్కపురం రమేష్‌ చిన్న నర్సయ్య, కొమురయ్య, ఉపేందర్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. 


జైపూర్‌: అంబేద్కర్‌ నివాసం పై దాడి చేసిన దుండగులను శిక్షించాలని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.  పి. నాగరాజు, మల్లేష్‌, వెంకటి, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-11T09:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising