ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-10-29T06:59:57+05:30

జిల్లాలోని ప్రభుత్వాభివృద్ధి, సంక్షేమ పథకాల పనుల లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌


మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 28: జిల్లాలోని ప్రభుత్వాభివృద్ధి, సంక్షేమ పథకాల పనుల లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా అధికారులు కలెక్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పల్లె ప్రగతి, రైతువేదికలు, సీఎంఆర్‌, వరిధాన్యం కొనుగోలు, ఇతరత్రా ప్రభుత్వ పథకాల లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే సమాచారం అందించాలని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో పనులు పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కలెక్టరేట్‌కు వచ్చిన సందర్భంగా అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామలాదేవి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T06:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising