ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిల్లర్లు లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-12-31T04:29:16+05:30

రైస్‌ మిల్లర్లకు కేటాయించిన లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు

మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హొళికేరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొళికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 30: రైస్‌ మిల్లర్లకు కేటాయించిన లక్ష్యాలను త్వరిత గతిన పూర్తి చేయాలని  కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ సమావేశ మందిరంలో రైస్‌ మిల్లర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వెంకటేశ్వర్లు సంబందిత శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించామని చెప్పారు. మిల్లర్ల వారీగా లక్ష్యాలను పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. మిల్లర్లు తప్పనిసరిగా రశీదు వివరాలు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. వెంటనే రైతులకు చెల్లింపులు చేయనున్నామని అన్నారు. ధాన్యం విక్రయమానికి వచ్చిన రైతుల పంటను, వాహన వివరాలు ట్యాబ్‌లలో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 43వేల 868 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 53కోట్ల 60లక్షల రూపాయాలను రైతుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. మిగతా వారికి త్వరలోనే ఖాతాల్లోనగదు జమ చేస్తామన్నారు. అన్ని శాఖల అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో పీడీ బి శేషాద్రి, డీసీవో సంజీవరెడ్డి, రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నల్మాస్‌ కాంతయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising