ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

ABN, First Publish Date - 2020-07-01T10:53:56+05:30

ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా 


ఆసిఫాబాద్‌, జూన్‌30: ఆహార భద్రత పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి రవిందర్‌ పథకానికి సంబంధించిన సాంకేతిక అంశాలు కమిటీకి వివరించి జిల్లా ప్రణాళికకు ఆమోదం పొందారు. ఈ పథకంలో పప్పు దినుసులు 3,464 హెక్టార్లకు గాను 58.99 లక్షలు, వరి 1,979 హెక్టార్లకు గాను 26.80 లక్షలు, పత్తి 455 హెక్టార్లకు 7.29 లక్షలు మొత్తం ఈ పథకం కింద 6,828 హెక్టార్లకు 105.67 లక్షలు జిల్లా ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. ఈ పథకంలో రైతులకు సాముహిక ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి రాంబాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాథోడ్‌ శ్యాంరావు, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ రాజేశ్వర్‌ నాయక్‌, ఉమ్మడి జిల్లా ఆహార భద్రత పథకం కన్సల్టెంట్‌ నర్సింగ్‌, వాసన్‌ ప్రతినిధి, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-01T10:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising