ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భగీరథ పనులను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2020-07-15T11:40:46+05:30

జిల్లాలో మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ  ఫారూఖీ


నిర్మల్‌, జూలై 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మిషన్‌భగీరథ పథకం ద్వారా ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి పనులు పూర్తి చేయాలన్నారు.


ఇప్పటి వరకు గ్రామాలలో పూర్తికాని పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి త్వరితగతిన పూర్తిచేసి ప్రతీ ఇంటికి తాగు నీరందించాలని సూచించారు. అలాగే జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిర్మించే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు జిల్లా లక్ష్యం మొత్తం 6,601 కాగా అందులో నిర్మల్‌ నియోజకవర్గంలో 3761, ముథోల్‌ నియోజకవర్గంలో 2240, ఖానాపూర్‌ నియోజకవర్గంలో 600 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. మం జూరైన మొత్తం ఇళ్ల టెండర్లు పూర్తి కావాలన్నారు. సిమెంట్‌, ఇసుక, రాడు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను గుత్తేదారులకు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు.


డబుల్‌ బెడ్‌రూంల కాలనీలో విద్యుత్‌ సరఫరా, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఏ.భాస్కర్‌రావు, 2బీహెచ్‌కే నోడల్‌ అధికారి మురళీధర్‌రావు, పంచాయతీ రాజ్‌ శాఖ ఈఈ సుదర్శన్‌ రావు, విద్యుత్‌, ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-15T11:40:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising