హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకు అరుదైన గౌరవం
ABN, First Publish Date - 2020-12-11T07:11:26+05:30
తమ హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఇతరుల హక్కులను కూడా గౌరవించాల్సిన అవసరముందని తెలంగాణ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య అన్నారు.
యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ 2020 అవార్డు అందజేత
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): తమ హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఇతరుల హక్కులను కూడా గౌరవించాల్సిన అవసరముందని తెలంగాణ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య అన్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఆహారం అందరికీ సమానంగా లభించినపుడే మనవ హక్కులు సాధించినట్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్యకు ‘యూనివర్సల్ హ్యూమర్ రైట్స్ అవార్డ్ 2020’ని తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్, కార్యదర్శి ప్రొఫెసర్ మహ్మద్ అక్తర్ అలీ, ఉజ్వల్ చందర్‌లు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ఈ అవార్డును ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. సంఘం అధ్యక్షులు రాజ్‌నారాయణ్ మాట్లాడుతూ అందరికీ సమాన హక్కులు వచ్చినపుడే దేశం అభివృద్ది చెందుతుందన్నారు.
హెచ్‌ఆర్‌సీలో అంతర్జాతీయ హ్యూమన్‌రైట్స్ డే వేడుకలు
అంతర్జాతీయ మానవహక్కుల సంఘం దినోత్సవ వేడుకలను నాంపల్లిలోని హెచ్‌ఆర్‌సీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య, మాజీ చైర్మన్ జస్టిస్ వై భాస్కర్‌రావు, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ జి. యతిరాజు, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎం వెంకటేశ్వరరెడ్డి హెచ్‌ఆర్‌సీ సభ్యులు ఎన్.ఆనందరావు, మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్, మాజీ సభ్యులు ఇస్మాయిల్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T07:11:26+05:30 IST