ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశ్చిమ బెంగాల్‌ పార్టీ ప్రతినిధులతో అసదుద్దీన్‌ భేటీ

ABN, First Publish Date - 2020-12-13T06:20:04+05:30

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆలిండియా మజ్లిస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ శనివారం ఆ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమై సమీక్షించారు. శాస్త్రీపురంలోని నివాసంలో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన మజ్లిస్‌ పార్టీ ప్రతినిధులు ఓవైసీతో భేటీ అయ్యారు. ఆరాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మజ్లిస్‌ పార్టీకి సానుకూల పరిస్థితులపై  రెండు గంటల పాటు వారితో  ఒవైసీ చర్చించారు. సమావేశంలో పశ్చిమబెంగాల్‌కు  చెందిన మజ్లిస్‌ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జమీర్‌ఉల్‌ హసన్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి జాహెద్‌ మహ్మద్‌, కోల్‌కతా హైకోర్టు న్యాయవాది మహ్మద్‌ అదనాన్‌, ముతి ఉర్‌ రహ్మాన్‌, ఆరిక్‌ అక్బర్‌ తదితరులు  పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పోటీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2020-12-13T06:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising