పకడ్బందీగా ఓటరు నమోదు
ABN, First Publish Date - 2020-12-30T04:41:29+05:30
ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఓటరు జాబితా పరిశీలకురాలు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖాధికారి డా.యోగితరాణా ఆదేశించారు.
-ఓటరు జాబితా పరిశీలకురాలు యోగితరాణా
ఆసిఫాబాద్, డిసెంబరు29: ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఓటరు జాబితా పరిశీలకురాలు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖాధికారి డా.యోగితరాణా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవో, తహసీల్దార్లతో ప్రత్యేక ఓటరు జాబితా-2021పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు ఫారం 6ను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. బీఎల్‌ఓ ద్వారా పూర్తి విచారణ జరిపి పేర్లు నమోదు చేయాలని సూచించారు. పేర్ల తొలగింపుకు ఫారం 7లను స్వీకరించి వాటిని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నోటీసు ఇచ్చినట్లయితే తొలగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఆర్వో సురేష్, ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T04:41:29+05:30 IST