ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్‌ 2న ఆవిర్భావ వేడుకలు

ABN, First Publish Date - 2020-05-30T10:51:49+05:30

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్‌ 2న నిరాడంబరంగా నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజరుకానున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌


ఆదిలాబాద్‌ టౌన్‌, మే 29: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్‌ 2న నిరాడంబరంగా నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నిర్వహిం చే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనే అతిథుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ వేడుకల్లో భాగంగా జిల్లాలో జూన్‌ 2 నిర్వహించే ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వ విప్‌ గంప్ప గోవర్ధన్‌ హాజరుకానున్నారు. అలాగే 2002 నిబంధనల మేరకు వేడుక ల్లో ప్లాస్టిక్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జిల్లా కేంద్రంతో పాటు మండల, గ్రామ, నియోజక వర్గం, మున్సిపాలిటీల పరిధిలో ఆవిర్భవ వేడుకలను నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని సూచించింది.


ఇందులో కలెక్టర్‌ కార్యాలయం, జడ్పీ, క్యాంపు కార్యాలయాలు, గ్రామ సర్పంచ్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మండల కేంద్రంలో ఎంపీపీలు జిల్లా కలెక్టర్‌ నుంచి మొదలుకొని వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్స్‌ తప్పకుండా అందుబాటులో ఉంచాలని, ఉదయం 9గంటలకు పతాకావిష్కరణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-05-30T10:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising