ప్రమాద రహిత ఉత్పత్తి సాధించాలి
ABN, First Publish Date - 2020-11-03T11:03:57+05:30
సింగరేణి భూగర్భ, ఉపరితల గనులలో సూపర్‌వైజర్లు, ఓవర్‌మెన్‌లు, హెడ్ ఓవర్‌మెన్‌లు, మైనింగ్ స్టాప్ రక్షణ నిబంధనలను అమలు చేస్తేనే ప్రమాద రహిత ఉత్పత్తి సాధ్యమవుతుందని శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణ
శ్రీరాంపూర్, నవంబరు2: సింగరేణి భూగర్భ, ఉపరితల గనులలో సూపర్‌వైజర్లు, ఓవర్‌మెన్‌లు, హెడ్ ఓవర్‌మెన్‌లు, మైనింగ్ స్టాప్ రక్షణ నిబంధనలను అమలు చేస్తేనే ప్రమాద రహిత ఉత్పత్తి సాధ్యమవుతుందని శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వృత్తి శిక్షణ కేంద్రంలో ఏరియాలో పనిచేస్తున్న భూగర్భ, ఉపరితల గనుల ఫ్రంట్ లైన్ సూపర్‌వైజర్లకు 12రోజుల శిక్షణలో భాగంగా జీఎం సోమవారం క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ సూపర్‌వైజర్లకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి స్ట్రక్చర్ ట్రైనింగ్ ప్రోగ్రాంను సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ఏరియాలో నిర్వహించడం జరుగు తుందన్నారు. సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రక్షణతో వెలికితీయడానికి ఫ్రంట్ లైన్ సూపర్‌వైజర్లు చేస్తున్న కృషి అత్యంత విలువైనదని జీఎం కొని యాడారు. భూగర్భ గనులలో పనిస్థలాల్లో పైకప్పు పరిస్థితులు బొగ్గు నిక్షేపాలు వివరాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలన్నారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రక్షణ సూత్రాలను అమలు చేయాలని ఆయన సూచించారు. భూగర్భ, ఉపరితల గనులలో ఏమైనా ప్రమాద పరిస్థితులు ఉంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగులు రక్షణలో సూపర్‌వైజర్ల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ఏరియా రక్షణాధికారి గుప్తా, వృత్తి శిక్షణ కేంద్రం ఎస్‌వోఎం కల్లూరి వెంకటరామారావు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-03T11:03:57+05:30 IST