అమర జవాన్లకు ఘన నివాళి
ABN, First Publish Date - 2020-06-18T10:49:59+05:30
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మృతి చెందిన భారత జవాన్లకు ఆసిఫాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి ఘనంగా నివాళులు
ఆసిఫాబాద్ రూరల్, జూన్17: భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మృతి చెందిన భారత జవాన్లకు ఆసిఫాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు వీధుల గుండా ఆర్యవైశ్య, వాసవి క్లబ్, కిరాణ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
రెబ్బెన: అమర జవాన్లకు గోలేటిలో బీజేపీ ఆధ్వ ర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడెల్ మాట్లాడుతూ పగలనక, రాత్రనక సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికుల సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గోలేటి నుంచి గోలేటి బస్టాఫ్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహింంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి ఆత్మీరాం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శణ్‌గౌడ్, ఉపాధ్యక్షుడు చక్రపాణి, సందీప్‌కుమార్, విశాల్, సుచిత్, రాజేష్, శేఖర్, కృష్ణకుమారి, రాజిరెడ్డి, సొల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: వీర మరణం పొందిన జవాన్ సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మండలంలోని గూడెం గ్రామంలో బీజేపీ నాయకులు, గ్రామ యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మాజీ జడ్పీచైర్మన్ సిడాం గణపతి, బీజేపీ మండల అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బుర్రి రుపేష్, నాయకులు రామగోని తిరుపతి గౌడ్, తొంబ్రె పోశన్న, గ్రామ యువకులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలో వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని పలు పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు పలు స్వచ్చంద సంస్థల సభ్యులు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ భారత్‌చైనా దేశాల సరిహుద్దున జరిగిన పోరాటంలో కల్నల్ సంతోష్‌బాబు వీరమరణం పొందటం బాధకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాంగ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ హరీష్‌బాబు, బీజేపీ ఇన్‌చార్జి డాక్టర్ శ్రీనివాస్, కాగజ్‌నగర్ యూనిటీ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - 2020-06-18T10:49:59+05:30 IST