ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 45 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-08-07T05:30:15+05:30

జిల్లా వ్యాప్తంగా గురువారం 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 6: జిల్లా వ్యాప్తంగా గురువారం 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితోపాటు పీహెచ్‌సీలో 150 పరీక్షలు నిర్వ హించగా 45 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. 


జైపూర్‌: పీహెచ్‌సీలో 8 మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు గురువారం వైద్యురాలు సంధ్యారాణి తెలిపా రు. మిట్టపల్లికి చెందిన ఓ యువకునికి, పీహెచ్‌సీలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందన్నారు. 

 

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ ఓసీపీలో ఎస్‌డీఎల్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న కార్మి కునికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వెంటనే అతన్ని వైద్యులు హోం క్వారంటైన్‌ చేసి చికిత్స చేపట్టారు. ఆర్కే 8 కాలనీలో కార్మికుడు ఉంటున్న వాడలో పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు.  


ఆర్‌ఎంపీపై కేసు నమోదు

నస్పూర్‌ : నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఊరు శ్రీరాంపూర్‌కు చెందిన ఆర్‌ ఎంపీ రామకృష్ణపై కేసు నమోదు చేశామని ఎస్సై ప్రమోద్‌రెడ్డి గురువారం తెలి పారు. జలుబు, దగ్గుతో అతని వద్దకు వెళ్ళగా కరోనా అని భయపెట్టడంతోపాటు బెదిరింపులకు పాల్పడినందుకు బాధితుడి తండ్రి రాజన్న ఫిర్యాదు చేశాడు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లఘించడంతోపాటు బెదిరించినందుకు ఆర్‌ఎంపీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-07T05:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising