ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువులకు ప్రమాద బీమా

ABN, First Publish Date - 2020-09-20T07:26:44+05:30

వాహనం ఢీకొని, రైలు కింద పడి, పిడుగు తాకిడి, విద్యుదాఘాతానికి గురై పదుల సంఖ్యలో గొర్రెలు, గేదెలు ఇతర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

80 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది

రైతులు 20 శాతం చెల్లిస్తే చాలు

15 నుంచిదరఖాస్తుల స్వీకరణ 

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడి

 

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వాహనం ఢీకొని, రైలు కింద పడి, పిడుగు తాకిడి, విద్యుదాఘాతానికి గురై పదుల సంఖ్యలో గొర్రెలు, గేదెలు ఇతర జీవాలు మృతి చెందినట్లు తరచూ వార్తలు చూస్తూనే ఉంటాం. అలాంటి ఘటన తర్వాత సదరు రైతు పరిస్థితి ఏమిటి? నష్టం నుంచి తను కోలుకొనేది ఎలా? అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పశువుల ప్రమాద బీమా పథకాన్ని తీసుకొస్తోంది. ప్రీమియంలో ఏకంగా 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.


పశు సంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందజేసిన జీవాలకు ప్రభుత్వమే బీమా ప్రీమియాన్ని చెల్లిస్తుందని, అవి ప్రమాదంలో మరణిస్తే బీమా క్లెయిమ్‌ కింద జీవానికి బదులు జీవాన్ని కొనుగోలు చేసి, లబ్ధిదారుడికి అందిస్తున్నట్లు చెప్పారు. రైతుల వద్ద ఉన్న గొర్రెలు, పాడి గేదెలు రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు వంటి పలు ప్రమాదాల బారినపడి చనిపోయిన సమయాలలో రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని చెప్పారు. అలాంటి వారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో కొత్త పథకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.


ఇందులో ప్రభుత్వం 80 శాతం, రైతులు 20 శాతం ప్రీమియం చెల్లించాలన్నారు. అక్టోబర్‌ 15 నుంచి జిల్లా పశుసంవర్థక శాఖ కార్యాలయాలలో రైతులు దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాను జిల్లాల పర్యటన చేసిన సమయంలో మందుల కొరత ఉందని పిర్యాదులు అందుతున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని ఆదేశించారు.


జీవాలకు అందుతున్న వైద్య సేవలు, పశుగ్రాసం పెంపకంపై ఈ నెల 23న అన్ని జిల్లాల పశు వైద్యాదికారులు, డెయిరీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర పశువైద్య మండలిని బలోపేతం చేేసందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న కారణంగా 4 రోజుల పాటు చేపల పిల్లల సరఫరా నిలిపి వేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కొత్తగా 5-6 విజయ ఔట్‌ లెట్స్‌ ఏర్పాటు చేయాలని డెయిరీ ఎండీ శ్రీనివా్‌సరావును ఆదేశించారు


Updated Date - 2020-09-20T07:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising