ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఏసీపీపై ఏసీబీ దృష్టి !

ABN, First Publish Date - 2020-10-01T08:42:42+05:30

పోలీసు శాఖలోని అవినీతి అధికారులపై వరుసగా కొరడా ఝలిపిస్తున్న ఏసీబీ తాజాగా మరో అవినీతి అధికారిపై దృష్టి సారించింది. అతనిపై చర్యలు తీసుకునేందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలోని అవినీతి అధికారులపై వరుసగా కొరడా ఝలిపిస్తున్న ఏసీబీ తాజాగా మరో అవినీతి అధికారిపై దృష్టి సారించింది. అతనిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాల ఆరోపణలపై ఏసీపీ జయరాం రెడ్డిని సస్పెండ్‌ చేసిన నెల రోజుల్లోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నర్సింహారెడ్డి ఆస్తులు రూ. 100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు మరో ఏసీపీ అవినీతిపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణలోని ఓ కీలక కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ అవినీతి, ఆదాయంపై ఏసీబీకి సమాచారం అందింది. దీంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కానిేస్టబుల్‌ నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు 8 మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.  

Updated Date - 2020-10-01T08:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising