ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ముగిసిన ఏసీబీ విచారణ

ABN, First Publish Date - 2020-08-27T22:03:53+05:30

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ విచారణ ముగిసింది. నాగరాజు, అంజిరెడ్డి, శ్రీనాథ్‌, వీఆర్‌ఏను 3 రోజులు ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ అధికారుల విచారణకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ విచారణ ముగిసింది. నాగరాజు, అంజిరెడ్డి, శ్రీనాథ్‌, వీఆర్‌ఏను 3 రోజులు ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ అధికారుల విచారణకు శ్రీనాథ్‌, అంజిరెడ్డి సహకరించలేదని తెలుస్తోంది. నలుగుర్ని వేర్వేరుగా విచారించిన ఏసీబీ అధికారులు విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరణ చేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన మూడు రోజుల కస్టడీ గడువు గురువారంతో ముగిసింది. చివరి రోజు కస్టడీలో నిందితుల నుంచి మరిన్ని వివరాలను ఏసీబీ అధికారులు రాబట్టినట్లు సమాచారం. నాగరాజు అవినీతి కేసులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాలు, కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కీసర జిల్లాకు సంబంధించిన మరికొంత మంది రెవెన్యూ అధికారులు, సిబ్బందిని విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-08-27T22:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising