ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డగోలుగా అధికార దుర్వినియోగం

ABN, First Publish Date - 2020-11-03T07:45:50+05:30

టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంజయ్‌

టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా నోట్ల కట్టలతో హోటళ్లలో మకాం వేస్తే పోలీసు యంత్రాంగం నిద్రమత్తులో ఉందా?అని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలే డబ్బు పంచుతూ బీజేపీపై నిందలు వేస్తున్నారని, అడ్డుకున్న తమ కార్యకర్తలపై దాడి చేయడమేంటని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై దాడి చేసినవారిపై, డబ్బులు పంపిణీ చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.


కాగా, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డబ్బు పంపిస్తున్నారన్న సమాచారంతోనే తమ నాయకులు హోటల్‌ వద్దకు వెళ్లారని ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. పోలీసు యంత్రాంగం టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నీతివాక్యాలు పలికిన మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు ఎందుకు మాట్లాడరని డీకే అరుణ ప్రశ్నించారు. బయటి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు సిద్దిపేటలో ఏం చేస్తున్నారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు.


Updated Date - 2020-11-03T07:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising