ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపూర్ణ శాకంబరీగా అమ్మవారు

ABN, First Publish Date - 2020-07-06T11:21:31+05:30

వరంగల్‌ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

270 కిలోల కూరగాయలతో అలంకరణ

భద్రకాళి ఆలయంలో ముగిసిన ఉత్సవాలు


వరంగల్‌ కల్చరల్‌, జూలై 5:  వరంగల్‌ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పదిహేనో రోజున ఆశాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంబరీగా అలంకరించి పూజారాధనలు చేశారు. వందలాది మంది భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనానికి  అనుమతించారు. ఆలయ ప్రాంగణంలో శానిటైజర్‌ను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో చిన్న పిల్లలను ఆలయంలోనికి అనుమతించలేదు. 


గతంలో మాదిరిగా కాకుండా వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి సేకరించిన కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు.  270 కిలోల కూరగాయాలతో హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ, స్మిత దంపతులు అమ్మవారి విగ్రహాన్ని అలంకరించారు. పశ్చిమ ఎమ్మెల్యే, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.

Updated Date - 2020-07-06T11:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising