ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మజ్లిస్‌కు 6.17 లక్షల ఓట్లు.. నోటాకు 28,870..

ABN, First Publish Date - 2020-12-05T09:03:09+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని డివిజన్లలో కలిపి ఎంఐఎం పార్టీ 6,17,050 ఓట్లను సాధించింది. 2016

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని డివిజన్లలో కలిపి ఎంఐఎం పార్టీ 6,17,050 ఓట్లను సాధించింది. 2016 ఎన్నికల్లో 44 డివిజన్లు గెలుచుకున్న ఎంఐఎం... ఈ సారి ఎన్నికల్లోనూ 44 డివిజన్లలో గెలుపొందింది. 2016 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఎంఐఎం ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. గత ఎన్నికల్లో ఎంఐఎంకు 5,30,812 ఓట్లు వచ్చాయి. అప్పుడు 15.85 శాతం, ఇప్పుడు 15.97 శాతం ఓట్లు వచ్చాయి.


ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితికి మొత్తం 1,580 ఓట్లు మాత్రమే వచ్చాయి. సీపీఐకి 2,170 ఓట్లు, సీపీఎం పార్టీకి 545 ఓట్లు, ఎంసీపీఐకి 12 ఓట్లు వచ్చాయి.

ఇక, నోటా(నన్‌ ఆఫ్‌ ది అబో)కు 28,870 మంది ఓట్లు వేశారు. అత్యధికంగా బన్సిలాల్‌పేట్‌లో 843 నోటా ఓట్లు పోలవగా ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 805 మంది నోటాకు ఓట్లు వేశారు.


Updated Date - 2020-12-05T09:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising