అనాథాశ్రమానికి 60 క్వింటాళ్ల బియ్యం
ABN, First Publish Date - 2020-03-27T11:24:56+05:30
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి 60 క్వింటాళ్ల బియ్యం మంజూరు చేశారు. దాతల సహకారంతో
మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో మంజూరు
యాదాద్రి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి 60 క్వింటాళ్ల బియ్యం మంజూరు చేశారు. దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమానికి నిత్యావసర వస్తువుల కొరత నెలకొంది. విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం ఆశ్రమాన్ని సందర్శించి 60 క్వింటాళ్ల బియ్యం మంజూరు చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆశ్రమవాసులకు ఆహారం అందించడంలో ఉత్పన్నమయ్యే సమస్యలను నిర్వాహకులు శంకర్ మంత్రికి వివరించారు. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి కలెక్టర్ అనితా రామచంద్రన్‌తో మాట్లాడి 60 క్వింటాళ్ల బియ్యం మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారు.
ఆశ్రమం బయట పారిశుధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయాలని మునిసిపల్ చైర్మన్, కమిషనర్లను ఆదేశించారు. విజయవాడ-హైదారాబాద్ జాతీయ రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలను ఎందుకు అనుమతిస్తున్నారని కొత్తగూడెం చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2020-03-27T11:24:56+05:30 IST