ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔట్‌లుక్‌ ర్యాంకింగ్స్‌లో హెచ్‌సీయూకి 5వ స్థానం

ABN, First Publish Date - 2020-09-14T09:40:53+05:30

: ఔట్‌లుక్‌ పత్రిక దేశంలోని ఉత్తమమైనవిగా ఎంపిక చేసిన 75 యూనివర్సిటీల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి 5వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీకి 23వ స్థానం దక్కాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఉస్మానియాకు 23- ఎస్వీయూకు 54
  • సాంకేతిక విద్యాసంస్థలో ్లహైదరాబాద్‌  ట్రిపుల్‌ ఐటీ, ఐఐటీ...
  • అనంత జేఎన్టీయూ, విజ్ఞాన్‌కు స్థానం


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఔట్‌లుక్‌ పత్రిక దేశంలోని ఉత్తమమైనవిగా ఎంపిక చేసిన 75 యూనివర్సిటీల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి 5వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీకి 23వ స్థానం దక్కాయి. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) నంబర్‌ వన్‌గా నిలిచింది. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి రెండో స్థానం దక్కింది. వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ(కెఎల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌)కు 32వ స్థానం, తిరుపతి శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీకి 54వ స్థానంలో ఉన్నాయి. అకడమిక్‌, పరిశోధనా రంగాల్లో ప్రతిభ, పరిశ్రమలతో సంబంధాలు, ప్లేస్‌మెంట్‌ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పరిపాలన, అడ్మిషన్లు, వైవిధ్యం, అందుబాటు ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. ఉత్తమ స్థాయిలో ఉన్న 25 సెంట్రల్‌ యూనివర్సిటీల ర్యాంకింగ్‌లలో  యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది.


ఉత్తమ స్థాయిలో ఉన్న 23 సాంకేతిక విద్యాలయాల ర్యాంకుల్లో హైదరాబాద్‌   ట్రిపుల్‌ ఐటీకి 11వ, హైదరాబాద్‌ ఐఐటీకి 14వ, అనంతపురం జేఎన్‌టీయూకు 18వ, గుంటూరులోని విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ సైన్స్‌కు 23వ స్థానం దక్కాయి. ఉత్తమ స్థాయిలో ఉన్న 75 పబ్లిక్‌ స్టేట్‌ వర్సిటీల్లో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీకి 5వ స్థానం, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి  10వ స్థానం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా యూనివర్సిటీకి 22వ స్థానం, శ్రీవేంకటేశ్వరా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు 42వ స్థానం, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి 56వ స్థానం, హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీకి 64వ స్థానం, గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీకి 65వ స్థానం, కడపలోని యోగి వేమన వర్సిటీకి 69వ స్థానం దక్కాయి. ఉత్తమ 50 డీమ్డ్‌ యూనివర్సిటీల ర్యాంకింగ్‌లను పోలిస్తే కోనేరు లక్ష్మయ్య వర్సిటీకి 12వ, విశాఖలోని గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజిమెంట్‌కు 22వ, హైదరాబాద్‌లోని ఐసిఎ్‌ఫఏఐ ఫౌండేషన్‌కు 36వ ర్యాంకు, అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌కు 43వ ర్యాంకు లభించాయి .


సెంట్రల్‌ వర్సిటీ వీసీ హర్షం

దేశంలోని 25 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉందని ఉపకులపతి అప్పారావు అన్నారు. ప్రపంచంలోని టాప్‌వర్సిటీల్లో స్థానం దక్కించుకునేలా మరింత కృషి చేస్తామని వీసీ తెలిపారు. 

Updated Date - 2020-09-14T09:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising