ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీలో కరోనా సేవలు ఇలా..

ABN, First Publish Date - 2020-04-08T10:13:13+05:30

పేదల ఆస్పత్రి.. గాంధీ! రాష్ట్రంలో మొట్టమొదటి బైపాస్‌ సర్జరీ జరిగింది అక్క డే!! ఇప్పుడు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు కూడా చికి త్స అందిస్తూ తన ప్రత్యేకతను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నాలుగు అంతస్తుల్లో కరోనా సేవలు
  • 5, 6, 8 అంతస్తుల్లో ఐసోలేషన్‌ వార్డులు
  • 7వ అంతస్తులో బాధితులకు వైద్యం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌7(ఆంధ్రజ్యోతి): పేదల ఆస్పత్రి.. గాంధీ! రాష్ట్రంలో మొట్టమొదటి బైపాస్‌ సర్జరీ జరిగింది అక్క డే!! ఇప్పుడు.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు కూడా చికి త్స అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు మొదట కేవలం 40 పడకలు కేటాయించారు. అలాంటిది.. ఇప్పుడు దాన్ని పూర్తిగా కరోనా చికిత్సలకే కేటాయించి 1164 పడకలను సిద్ధం చేశారు. హెల్ప్‌ డెస్క్‌ నుంచి ఎనిమిదో అంతస్తు దాకా కరోనా చికిత్సకే అంకితం చేశారు. ఆస్పత్రిలోని ఓపీకి నిత్యం 200 నుంచి 300 వరకు కరోనా అనుమానితులు వస్తున్నారు. 150 నుంచి 200 మంది వరకు అడ్మిషన్‌ ఉంటోంది. 


ప్రవేశ ద్వారం నుంచే..

తమకు కరోనా సోకిందన్న అనుమానంతో ఎవరైనా గాంధీ ఆస్పత్రికి రాగానే ప్రవేశ ద్వారం వద్దనే పరిశీలిస్తారు. సెక్యూరిటీ గార్డులు వారికి మాస్కులు ఇచ్చి  హెల్ప్‌ డెస్క్‌ వద్దకు పంపిస్తారు. అక్కడ కొంత మంది నర్సులు, పీజీలు, ఇతర సిబ్బంది వచ్చిన రోగిని పరిశీలిస్తారు. వారిలో కరోనా లక్షణా లు లేకపోతే అవసరమైన మందులు ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి పంపించేస్తారు.  కరోనా లక్షణాలుంటే క్యాజువాలిటికి పంపిం చి, అడ్మిట్‌ చేసుకుంటారు. తరువాత నమునాలు సేకరించి, ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తారు. క్యాజువాలిటీలో 25 మంది వరకూ నర్సులు అందుబాటులో ఉంటారు. ఆస్పత్రిలోని 5, 6, 7, 8 అంతస్తులను కరోనా సేవలకు కేటాయించారు. అనుమానితులను ముందుగా 5, 6 అంతస్తులకు తరలిస్తారు. వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారిని 7వ అంతస్తులోని ప్రత్యేక వార్డుకు తరలిస్తారు. ప్రాణాపాయం ఉన్నవారికి ఐసీయూలో చికిత్సలు అందిస్తారు. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినవారిని 14 నుంచి 17 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుతారు. మొదటి వారంలో రెండుసార్లు, రెండో వారంలో మరో రెండుసార్లు నమునాలు సేకరించి పరీక్షలు చేస్తారు. 


రోజుకు మూడుసార్లు..

వైరస్‌ బాధితులకు రోజూ మూడుసార్లు జ్వరం, బీపీ చూ స్తారు. నర్సులే షిఫ్టులవారీగా ఈ పరీక్షలు చేస్తున్నారు. ఒక రోజు ఒక పీజీ, ఒక నర్సు వెళ్లితే, మర్నాడు అలా మరో బృం దం వెళ్లుతుంది. ఇలా వెళ్లిన ప్రతిసారీ వారు పీపీఈ కిట్‌ ధరించి వెళ్లి సేవలు అందిస్తున్నారు. భోజనంలో అన్ని పోషకాలూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Updated Date - 2020-04-08T10:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising