ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో 3వ కేసు

ABN, First Publish Date - 2020-03-16T08:51:41+05:30

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. తాజాగా, నెదర్లాండ్‌ నుంచి వచ్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుమానంతో ఓ ఐఏఎ్‌సకు పరీక్షలు

ఆ 7 దేశాల నుంచి వచ్చే అందరికీ క్వారంటైన్‌

క్వారంటైన్‌కు రాకపోతే రంగంలోకి పోలీసులు

తెలంగాణలో మరొకరికి

నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌

మూడుకు చేరిన కరోనా కేసుల సంఖ్య


హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. తాజాగా, నెదర్లాండ్‌ నుంచి వచ్చిన హైదరాబాద్‌వాసికి పాజిటివ్‌గా గుర్తించారు. హైదరాబాద్‌లోనూ, పుణెలో కూడా ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఇటలీ నుంచి వచ్చిన వైద్య విద్యార్థినికి ఇప్పటికే కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆమెతోపాటు నెదర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తి కూడా గాంధీలో చికిత్స పొందుతున్నారు. సౌదీ నుంచి వచ్చిన యువతి నమూనాల్లో నెగెటివ్‌ వచ్చింది. కాగా, కరోనా అనుమానిత లక్షణాలతో ఓ ఐఏఎస్‌ అధికారికి కూడా ఆదివారం కరోనా పరీక్షలు చేసినట్లు తెలిసింది.


ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. కాగా, నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన 12 మందిని గుర్తించి ఐసొలేషన్లో ఉంచారు. కాగా, మంచిర్యాలజిల్లావాసికి కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఇక, కరోనా లక్షణాలతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు వరంగల్‌లోని ఎంజీఎంలో చేరారు. రోగి నమూనాలు సేకరించి హైదరాబాద్‌ పంపించారు.


క్వారంటైన్‌కు రాకపోతే పోలీసుల రంగ ప్రవేశం

కరోనా తీవ్ర ప్రభావం ఉన్న ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ క్వారంటైన్‌ చేయాలని సర్కారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వారిని 14 రోజులపాటు వికారాబాద్‌లోని హరిత రిసార్ట్సులో ఉంచనున్నారు. ఇప్పుడు వీరిని మూడు కేటగిరీలు విభజించాలని నిర్ణయించారు. ‘ఏ’ కేటగిరీని హైరి్‌స్కగా గుర్తిస్తారు. వీరిని నేరుగా ఆస్పత్రికి తరలిస్తారు. ‘బి’ కేటగిరీని మోడరేట్‌ రిస్కు కింద పరిగణిస్తారు. వీరిలో 60 ఏళ్లు పైబడి ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలించి, ప్రతిరోజూ అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. ఇక, ఎటువంటి లక్షణాలూ లేని ‘సి’ కేటగిరీని తక్కువ రిస్క్‌ ఉన్నవారుగా పరిగణిస్తారు.


వీరిని ఇంట్లోనే ఏకాంతవాసంలో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. కానీ, వీరిని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి సర్కారు లేఖ రాసింది. తక్కువ రిస్క్‌ అని, లక్షణాలు లేవని విమానాశ్రయాల నుంచి ఇంటికి పంపిన తర్వాత పాజిటివ్‌ వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సీ కేటగిరీ వారిని కూడా క్వారంటైన్‌ చేయనుంది. కాగా, కొందరు విదేశాల నుంచి నేరుగా రావడం లేదు. ఢిల్లీ, ముంబై వంటి చోట్ల విమానాలు దిగి, అక్కడి నుంచి రైళ్లు, బస్సుల ద్వారా రాష్ట్రానికి వస్తున్నారు. దాంతో, వారిని గుర్తించడం కష్టమవుతోంది.


ఈ నేపథ్యంలోనే, ఇతర రాష్ట్రాల సహకారం తీసుకుంటోంది. తెలంగాణవాసులు ఎవరైనా అక్కడ దిగారా అనే సమాచారం తెలుసుకుంటోంది. ఇప్పటిదాకా ఇటువంటి వ్యవస్థ లేదు. శంషాబాద్‌ విమానాశ్రయ అధికారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తోంది. అలాగే, విదేశాల నుంచి వచ్చిన కొందరు క్వారంటైన్‌కు ఒప్పుకోవడం లేదు. వైద్య ఆరోగ్య సిబ్బందిని ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇటువంటి వారి విషయంలో పోలీసుల సహకారం తీసుకుంటోంది.

Updated Date - 2020-03-16T08:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising