ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 స్కీములతో 156కోట్లు స్వాహా

ABN, First Publish Date - 2020-07-05T07:01:32+05:30

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1,456 మందిని మోసం చేసి, రూ.156 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. సైబరాబాద్‌ పోలీసులు అతడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 1,456 మందిని ముంచిన మోసగాడు 
  • స్వధాత్రి ఇన్‌ ఫ్రా పేరుతో దందాలు
  • ఆటకట్టించిన సైబరాబాద్‌ పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1,456 మందిని మోసం చేసి, రూ.156 కోట్లు కొల్లగొట్టాడు ఓ కేటుగాడు. సైబరాబాద్‌ పోలీసులు అతడి ఆటకట్టించి అరెస్టు చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన యార్లగడ్డ రఘుబాబు అతి తక్కువ సమయంలో రూ.వందల కోట్లు సంపాదించాలని పథకం వేశాడు. హైదరాబాద్‌కు మకాం మార్చి మూడు స్కీములను రూపొందించాడు. స్వధాత్రి ఇన్‌ఫ్రా పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి.. రూ.లక్ష, అంతకు మించి పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 9శాతం వడ్డీ చెల్లిస్తామంటూ నమ్మించి 950 మంది నుంచి రూ.87 కోట్లు కొల్లగొట్టాడు. అలాగే, బై బ్యాక్‌ స్కీమ్‌ వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించి ప్లాట్లు సొంతం చేసుకోవచ్చని పేర్కొంటూ 300 మంది నుంచి రూ.42కోట్లు కొల్లగొట్టాడు.


ఆ తర్వాత స్వధాత్రి ఫ్లాట్స్‌ బంపర్‌ ఆఫర్‌ పేరుతో మూడో స్కీమ్‌కు తెరతీశాడు. యార్లగడ్డ రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ బిల్డర్స్‌తో ముందుగా కొన్ని ఫ్లాట్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పందం చేసుకునేవాడు. 40 శాతం డబ్బులు చెల్లించేవాడు. తర్వాత వాటిని ఇతరులకు అమ్మేసేవాడు. ఫ్లాట్‌ కోసం 70 శాతం డబ్బులు చెల్లించిన వారికి ఫ్లాట్‌ చేతికందేవరకు ఇంటి అద్దె కింద నెలకు రూ. 10వేలు చెల్లిస్తానని బంపర్‌ ఆఫర్‌లో పేర్కొన్నాడు. ఇలా 200 మంది నుంచి రూ.27 కోట్లు కొల్లగొట్టాడు. ముచ్చటగా మూడు స్కీములు పెట్టి 1,456 మందిని ముంచేసి మొత్తం రూ.156 కోట్లు కొల్లగొట్టాడు. ప్రతి నెల అందాల్సిన డబ్బులు రాకపోవడంతో బాధితులు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రఘుబాబుకు సహకరించిన శ్రీనివాసబాబును సైతం పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2020-07-05T07:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising