మూడు రోజుల్లో రూ.28.44 కోట్లు!
ABN, First Publish Date - 2020-12-11T09:04:29+05:30
గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీ కొనసాగుతోంది. గురువారం 11,103 మందికి రూ.10 వేల చొప్పున
కొనసాగుతున్న వరద సాయం పంపిణీ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీ కొనసాగుతోంది. గురువారం 11,103 మందికి రూ.10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో 28,436 మందికి రూ.28.44 కోట్లు అందించామన్నారు.
సాయం నిలిపివేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలకు ముందు మీ-సేవ ద్వారా వచ్చిన పెండింగ్ దరఖాస్తుదారులకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా బాధితుల గుర్తింపునకు సంబంధించి ఉన్నత స్థాయిలో స్పష్టత రావాల్సి ఉందన్నారు.
Updated Date - 2020-12-11T09:04:29+05:30 IST