ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో కొత్తగా 1,718 కేసులు

ABN, First Publish Date - 2020-10-04T07:56:09+05:30

రాష్ట్రంలో శుక్రవారం 1,718 కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైర్‌సతో మరో 8 మంది మృతి

తగ్గిన నాన్‌ కోమార్బిడిటీస్‌ మరణాలు


హైదరాబాద్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శుక్రవారం 1,718 కరోనా కేసులు నమోదయ్యాయి. వైర్‌సతో మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 1,97,327కు, మృతుల సంఖ్య 1,153కు చేరింది. మరోవైపు రాష్ట్రంలో ఇతరత్రా వ్యాధులేవీ (నాన్‌ కోమార్బిడిటీస్‌) లేకుండా కొవిడ్‌ కారణంగా సంభవిస్తున్న మరణాలు 2 శాతం తగ్గాయి. సెప్టెంబరు 2 నాటికి కేవలం కరోనాతోనే మృతి చెందుతున్నవారు 46 శాతం ఉండగా, ప్రస్తుతం 44 శాతానికి తగ్గింది. దీర్ఘకాలిక జబ్బు (కోమార్బిడిటీ్‌స)లతో బాధపడుతూ.. కరోనా సోకడంతో చనిపోయినవారు సెప్టెంబరు 2 నాటికి 53 శాతం ఉండగా, ప్రస్తుతం 55 శాతానికి పెరిగింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో పరీక్షలు తగ్గాయి. 49,084 టెస్టులు మాత్రమే చేయడంతో కేసులు కూడా తక్కువగానే నమోదయ్యాయి. మరో 2,002 మంది డిశ్చార్జ్‌ కావడంతో ఇప్పటివరకు 1,67,846 మంది కోలుకున్నట్లైంది. ప్రతి పది లక్షల జనాభాకు పరీక్షల సంఖ్య 84,729కి పెరిగింది. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిఽధిలో 285 రాగా, కరీంనగర్‌లో 105, మేడ్చల్‌లో 115, నల్లగొండలో 103, రంగారెడ్డిలో 129, సిద్దిపేటలో 76, ఖమ్మంలో 79 నమోదయ్యాయి.

Updated Date - 2020-10-04T07:56:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising