ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కరోనాకు సంబంధించి తాజా అప్‌డేట్ ఇది..

ABN, First Publish Date - 2020-04-11T03:41:06+05:30

తెలంగాణలో శుక్రవారం కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకూ 12 మంది కరోనా సోకి మరణించారు. తెలంగాణలో కరోనా నుంచి 48 మంది కోలుకున్నారు. అయితే.. పాజిటివ్ కేసుల్లో 200 వరకూ హైదరాబాద్‌లోనే నమోదు కావడం గమనార్హం.


జిల్లాల వారీగా చూసుకుంటే నిజామాబాద్‌లో 49, రంగారెడ్డి 34, వరంగల్ అర్బన్ 24, నల్గొండ 12, గద్వాల 19, కరీంనగర్ 18, మేడ్చల్‌లో 24 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 10, మహబూబ్‌నగర్ 11, నిర్మల్ 15, కామారెడ్డిలో 10 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట 9, మెదక్ 5, సంగారెడ్డి 7, వికారాబాద్ 8, జగిత్యాల 2, జనగామ 2, నాగర్‌కర్నూలు 2, ములుగు 2, పెద్దపల్లి జిల్లాలో 2, భద్రాద్రి కొత్తగూడెం 2, భూపాలపల్లి 2, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో రెండేసి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-04-11T03:41:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising