ములుగు జిల్లాలో 14 కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-12-30T05:24:13+05:30
ములుగు జిల్లాలో 14 కరోనా కేసులు
ములుగు, డిసెంబరు 29 : ములుగు జిల్లాలో మంగళవారం 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 441 మందికి ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షలు నిర్వహించగా ములుగు మండలంలో ఒకరి కి, ఏటూరునాగారంలో ఇద్దరికి, వెంకటాపూర్(రామప్ప)లో నలుగురికి, గోవిందరావుపేటలో ఇద్దరికి, తాడ్వాయిలో ఇద్దరికి, కన్నాయిగూడెంలో ఇద్దరికి, మంగపేట మండలంలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య తెలిపారు.
Updated Date - 2020-12-30T05:24:13+05:30 IST